పదవ తరగతి పరీక్ష ప్రశాంతం.... జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద *పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు (99.9%) మంది విద్యార్థులు హాజరు
📅 13 April 2026, 02:25 PM
✍️ admin
పెద్దపల్లి, ఏప్రిల్-13:
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షకు (7495) మంది హాజరు కావాల్సి ఉండగా, (7485) మంది హాజరు కాగా,(10) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, 99.9 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని ఇట్టి పరీక్షకు సంబంధించి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది