Banner
Watermark
నేషనల్ హైవేస్ అంబులెన్స్ ప్రారంభం ప్రాణ రక్షణలో కీలక అడుగు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 13 April 2026, 02:18 PM ✍️ admin
News Image

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” కింద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవేస్ (యాదాద్రి - వరంగల్ ఎన్హెచ్ - 163) అధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నూతన అంబులెన్స్ కు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ అంబులెన్స్ ద్వారా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణమే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో “గోల్డెన్ అవర్” లో అందించే వైద్య సేవలు ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కొత్త అంబులెన్స్ ఆధునిక వైద్య పరికరాలతో సన్నద్ధంగా ఉండి, ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రులకు వేగంగా తరలించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్, ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, ఇతర సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, పోలీసు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home