హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని సుల్తానాబాద్ పురపాలక సంఘం లో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,
హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. పట్టణంలోని ల్యాండ్‌మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.
హౌస్ లిస్టింగ్ బ్లాక్‌కు సంబంధించిన వివరాలు ఖచ్చితమైన సమాచారంతో సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ విజయ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది