Banner
Watermark
విద్యుత్ సరఫరాను మరింత మెరుగు పరచడంలో భాగంగా ప్రతిపాదిత నూతన సబ్‌స్టేషన్ స్థలాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల
📅 06 April 2026, 03:50 PM ✍️ admin
News Image
విద్యుత్ సరఫరాను మరింత మెరుగు పరచడంలో భాగంగా ప్రతిపాదిత నూతన సబ్‌స్టేషన్ స్థలాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మండలంలోని సుభాష్ నగర్‌, వేములవాడ , చందుర్తి మండలం లోని లింగం పేట , ఏనుగల్లు లో కొత్త సబ్‌స్టేషన్ స్థల పరిశీలనను సోమవారం ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ శ్రీ వి. మోహన్ రావు పరిశీలించారు. సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) బి . బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ సిరిసిల్ల అంజయ్య తో కలిసి స్థలాలను సందర్శించి, సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అనుకూలత, భూసౌకర్యాలు, సాంకేతిక అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ శ్రీ వి. మోహన్ రావు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కొత్త సబ్‌స్టేషన్ లు ఎంతో గానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుతో లో వోల్టేజ్ సమస్యలు తగ్గి, సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు
🏠 Home