Banner
Watermark
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
📅 04 April 2026, 02:09 PM ✍️ admin
News Image
పెద్దపల్లి ఏప్రిల్ 04:
-------------------------
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా రంగంపల్లి రోడ్డు , మార్కెట్ యార్డ్, కునారం రోడ్డు, సుల్తానాబాద్ లోని వివిధ ప్రాంతాల వద్ద మీడియన్ ఓపెనింగ్ లను 10 రోజుల పాటు క్లోజ్ చేసి పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రాంగ్ రూట్ ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున, వీటి నివారణకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని, రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులకు భారీ జరిమానాలు విధించాలని అన్నారు.

రహదారి పక్కన ఇట్టుక బట్టీల వద్ద వేగం నియంత్రించేందుకు రంబుల్ ష్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాఘవపూర్, సబ్బితం గ్రామాల వద్ద మెయిన్ రోడ్డుకు జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. మంథని ఫ్లైఓవర్ వద్ద అవసరమైన చోట కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఈఈ ఆర్ అండ్ బి భావ్ సింగ్, ట్రాఫిక్ సిఐ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home