Banner
Watermark
వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదయిన మత్తు ద్వారా ఆపరేషన్..
📅 31 March 2026, 11:24 AM ✍️ admin
News Image
జగిత్యాల జిల్లా కు చెందిన 60 ఏళ్ల మహిళ రొమ్ములో గడ్డతో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి కి రావడం జరిగింది.షుగర్ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధ పడుతున్న ఆమెకు నోటిని పూర్తిగా తెరవడం లో కూడా ఇబ్బంది ఉంది. జనరల్ అనస్థీషియా ఇచ్చేందుకు అనువుగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లాంటి పెద్ద ఆసుపత్రి కి పంపించాలి.కానీ మత్తు వైద్యులు తిరుపతి,రాజశ్రీ ల సలహాతో అరుదయిన మత్తు ఇచ్చి ఇక్కడే ఆపరేషన్ చెయ్యాలని సీనియర్ ఆపరేషన్ల నిపుణులు డా. పెంచలయ్య నిర్ణయించుకొని వారి బృందం డాక్టర్లు మోహన్ కృష్ణ, అలేఖ్య లతో మత్తు వైద్యులు డా. తిరుపతి , రాజశ్రీ సెగ్మెంటల్ థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేశారు.ఇట్టి ఆపరేషన్ చేసిన బృందానికి సూపరిండెంట్ డా.రవీందర్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో గతంలో లాగా సాధారణ కాన్పులు మరియు ఆపరేషన్లు జరుగుతున్నాయని ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఆపరేషన్ లో పాల్గొన్నఇతర సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
🏠 Home