అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, మార్చి 30:
------------------------------
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి మండలం రంగా పూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య గ్రామంలో తనకు ఎకరం 5 గంటల వ్యవసాయ భూమి ఉందని, VSB బ్రిక్స్ నుంచి వచ్చే దుమ్ము ధూళి బూడిద వల్ల తన పొలంలో పండే కూరగాయల పంటకు నష్టం వస్తుందని, VSB బ్రిక్స్ పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ పెద్దపల్లి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన ఎర్రం వర లక్ష్మి తనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తనను ఎవరు చూసుకోవడం లేదని వృద్ధుల పోసిన సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డిఓ పెద్దపల్లి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన కుమారస్వామి తమకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజేశ్వర రావు గ్రామ శివారు సర్వే నెంబర్ 330 నుంచి 331 లో గల కాలువలో మట్టి తీయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఈ ఇరిగేషన్ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి పట్టణం విద్యానగర్ కు చెందిన విటల్ తమకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ విచారించి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది