Banner
Watermark
రాజన్న సిరిసిల్ల, మార్చి 26, 2026:
📅 26 March 2026, 04:04 PM ✍️ admin
News Image
RAMP ప్రాజెక్ట్ కింద, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC), రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో EDC బృందం 26.03.2026 తేదీన ఎల్లారెడ్డిపేట ఐటీఐ కాలేజీలో ఒక రోజు ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ టి. హనుమంతు పాల్గొని, MSMEలకు ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వివరించారు.

ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రతి MSME తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ పొందాలని సూచించారు.
ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని తెలిపారు. ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సహాయం కావాలనుకునే వారు కలెక్టరేట్‌లోని EDC కార్యాలయాన్ని సంప్రదించవచ్చని,
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
గెస్ట్ ఫ్యాకల్టీగా శ్రీ బి. విజయ్ కుమార్ (ఫెసిలిటేటర్) మరియు శ్రీ జి. వంశీకృష్ణ (DLT) పాల్గొని, ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యతపై పాల్గొనేవారికి వివరించారు.

ఈ కార్యక్రమాన్ని EDC మేనేజర్ శ్రీ కె. జయంత్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ టి. వెంకట శివసాయి నిర్వహించారు.
🏠 Home