Banner
Watermark
దాతల సహకారంతో 1801 రోజులుగా అన్నార్తులకు అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
📅 26 March 2026, 03:32 PM ✍️ admin
News Image
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1801 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న భీమేశ్వర ఆలయాలవద్ద గల పేదలకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా పెళ్లిరోజు సందర్భంగా అనుపురం వాస్తవ్యులు తాండ్ర పర్శరాములు ఝాన్సీ దంపతులు శాశ్వతదాతలుగా డాక్టర్ జువ్వాడి వెంక టేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగుల చంద్ర శేఖర్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home