Banner
Watermark
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ధర్మారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల(బీఆర్సీ) తయారీ కేంద్రం ప్రారంభం
📅 25 March 2026, 04:55 PM ✍️ admin
News Image
రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు అలాగే తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. జిల్లాకు 9 బయో ఇన్ ఫుట్ రిసోర్స్ సెంటర్(బీఆర్సీ)సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తయారీ కేంద్రాలు) మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు అందజేసిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు, కషాయాలు ఆవు పేడ ఇతర పదార్థాలతో సిద్ధం చేసిన వాటిని రైతులు సాగులో వినియోగించుకునేందుకు తోడ్పాటు అందించేందుకు ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు రైతులు తమ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి తయారీ కేంద్రాలు సందర్శించి సాగులో ఆయా ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ ఆర్థికంగా భరోసా ఇస్తుందని తెలిపారు. దీంతో నేలకు పర్యావరణానికి ఎంతో మేలు అని కలెక్టర్ వివరించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home