శ్రద్ధగా చదవాలి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్ళపల్లి, మార్చి -20
విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల&కళాశాలలో కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది హాజరు రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు. స్టోర్ రూమ్ లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. మెనూ చార్ట్ పరిశీలించి ఆహార పదార్థాలను పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో పలు అభివృద్ధి పనుల పురోగతి పై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షల మధ్య విరామ సమయం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. శ్రద్ధగా అన్ని పాఠ్యాంశాలు మరోసారి చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ లలో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.