Banner
Watermark
రాజన్న సిరిసిల్ల, మార్చి -18 జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
📅 18 March 2026, 05:35 PM ✍️ admin
జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఎల్‌పీజీ గ్యాస్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు తెలిపారు.


ఈ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించేందుకు టి. సృజన, వి. వినాయక్‌ లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే వినియోగదారులు 8008429738 ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని తెలిపారు.


జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా, పంపిణీకి సంబంధించిన సమస్యలను పర్యవేక్షించడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించే చర్యలు తీసుకుంటామన్నారు.


కంట్రోల్ రూమ్‌లో నమోదు అయ్యే ఫిర్యాదులను సంబంధిత అధికారులు, ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీలకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
🏠 Home