జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం 17.3.2026 ఈరోజు తంగళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను "ప్రజా పాలన
ప్రగతి ప్రణాళిక 99 రోజుల" కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య నిపుణుల ఉచిత ఆరోగ్య శిబిరం ను సందర్శించి వ్యాధిగ్రస్తుల వివరాలు, నేత్ర సంబంధిత, దంత సంబంధిత, పిల్లల వైద్య నిపుణులు, స్త్రీల వైద్య నిపుణులచే పరీక్షించిన మొత్తం (255) వ్యాధిగ్రస్తులను పరీక్షించి, మందులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్నేహ గార్లు పాల్గొన్నారు.