Banner
Watermark
వేములవాడలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు
📅 17 March 2026, 09:59 AM ✍️ admin
News Image
ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వేములవాడ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బద్ది పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, వేద పండితులు పాల్గొన్నారు.
🏠 Home