కళారత్న నేషనల్ అవార్డ్" అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు)
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క పోచ రాజయ్య (నక్క రాజు) ఆదివారం సాయంత్రం తిరుపతి లోని జి.ఎస్.కె.ఆర్. భవన్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా "కళారత్న నేషనల్ అవార్డ్" అందుకున్నారు.
బహుజన జాతీయవాది
మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి సందర్భంగా తిరుపతిలో 18వ జాతీయ స్థాయి సాహితీ వేత్తల సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభను బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.
దాదాపు గత రెండు దశాబ్దాలుగా నక్క పోచ రాజయ్య (నక్క రాజు)చేస్తున్న కళా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, ఉద్యమ కళా ప్రదర్శనలు, 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం, తెలంగాణ ఉద్యమ కారునిగా అందించిన ఉద్యమ కార్యక్రమాలు, నేటికీ సమాజ హితం కోసం ఆయన చేస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, యువత గంజాయి, డ్రగ్స్ లకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం సదస్సులు, మహిళలకు, బాలికలకు భరోసా లాంటి కార్యక్రమాలను నిర్వహించడం లాంటి అతని గొప్ప కలలను గుర్తించి ఈ "కళారత్న నేషనల్ అవార్డ్" అందించడం జరిగిందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలిపారు.