Banner
Watermark
రాజన్న సిరిసిల్ల, మార్చి -13 సిరిసిల్ల అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకలెక్టర్ గరిమ అగ్రవాల్
📅 13 March 2026, 03:23 PM ✍️ admin
News Image
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు.
పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
🏠 Home