కరీంనగర్ డంపింగ్ యార్డు ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
డంపింగ్ యార్డు వల్ల కరీంనగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్..
కరీంనగర్ పట్టణ ప్రజల ఇబ్బందులు పడుతున్న దృశ్య చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డు తరలిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
కరీంనగర్ డంపింగ్ యార్డు శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈరోజు డంపింగ్ యార్డు ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అక్కడకి వెళ్లి పర్యటించి తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ,ఇతర ముఖ్యనేతలు
మంత్రి పొన్నం ప్రభాకర్
పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారింది..
గతంలో కేంద్ర మంత్రి కట్టర్ గారు కరీంనగర్ కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశాం..
ఇటీవల ముఖ్యమంత్రి గారు చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం.. ఆయన సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారు..
కరీంనగర్ నుండి తరలించిన డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు..
డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా రెండు నగరాల మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాం..
ఈరోజు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కమిషనర్ కార్పొరేటర్లు కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగింది
కరీంనగర్ స్మార్ట్ సిటీ లో వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారు..
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈరోజు డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగింది
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్... ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటాం..
ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తున్నారు..
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులను అధికారుల బాధ్యత తీసుకున్నాం ..
డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల శ్వాసకోస ఇబ్బందులతో పాటు , అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి..
40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదు.. సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తాం..
రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపుకు చొరవ తీసుకుంటాం..
డంపింగ్ యార్డ్ తరలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది