మార్చ్ 10 జనగాం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా పరిశీలిం చారు.
ధర్మ కంచ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ ను కలెక్టర్ పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్..
కేంద్రంలో హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు
పరీక్షలు పూర్త య్యే వరకు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
విద్యార్థులకు తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు
మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాద ని స్పష్టం చేశారు.