Banner
Watermark
మార్చ్ 7 జనగాం ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగం గా SHG సభ్యులు ఎరువుల విక్రయ కేంద్రాల నిర్వహణ
📅 07 March 2026, 05:14 PM ✍️ admin
News Image
ల్లా రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో, సులభంగా అందుబాటులో ఉండే విధంగా ప్రతి క్లస్టర్‌లో స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

SHG సభ్యులు ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ అంశం మీద శనివారం
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో నిర్వహించారు


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల సామగ్రి రైతులకి మరింత సులభం గా అందించేందుకు వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రాబోయే సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇన్‌పుట్‌లు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

జనగామ జిల్లాలో మొత్తం 62 క్లస్టర్లు ఉన్నాయని, ప్రతి క్లస్టర్‌లో ఒక ఎరువుల విక్రయ కేంద్రంను స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎరువులు మరియు విత్తనాలు సమీపంలోనే అందుబాటులోకి రావడంతో పాటు రైతుల సమయం, రవాణా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు.

అలాగే ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా స్థిరత్వం కలగడంతో పాటు వారి ఆదాయం పెరుగుతుందని, దీని ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు కూడా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు DRDOతో సమన్వయం చేసుకొని అవసరమైన అర్హతలు, లైసెన్సులు, శిక్షణ, ఇతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి క్లస్టర్‌లో ఎరువుల విక్రయ కేంద్రం స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాబోయే సాగు సీజన్‌కు ముందుగానే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు మరియు ఎరువులు సకాలంలో అందుబాటులోకి రావడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి కూడా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో DRDO, జిల్లా వ్యవసాయ అధికారి (DAO), సహాయ వ్యవసాయ సంచాలకులు (ADAs), వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్లు (APMs) కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCలు) పాల్గొన్నారు.
🏠 Home