మోతాజుఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంలో అడల్ట్ వ్యాక్సినేషన్ -ఆరోగ్య సంరక్షకుల కోసం హెపటైటిస్-బి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం'.
పత్రికా ప్రచురణ నిమిత్తము
తేదీ 20-02-2026
" మోతాజుఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంలో అడల్ట్ వ్యాక్సినేషన్ -ఆరోగ్య సంరక్షకుల కోసం హెపటైటిస్-బి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం'.
ఈరోజు ఉదయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు ప్రోగ్రాం అధికారులతో కలిసి మోతాజుఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్ వ్యాక్సినేషన్ - హెపటైటిస్-బి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెపటైటిస్-బి వ్యాధి నుండి ఆరోగ్య సంరక్షకులను రక్షించడం, ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త కోసం మరియు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ అడల్ట్ వాక్సినేషన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరుగుతుందన్నారు.
ఈ అడల్ట్ వాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిద,జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ, పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇమ్రాన్, సూపర్వైజర్ బేగ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Sd/-
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
కరీంనగర్
దీని ప్రతి అందరూ పత్రికా ప్రతినిధులకు ప్రచురణ నిమిత్తము శ్రీయుత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా పంపనైనది.