Banner
Watermark
ఈవీఎం గోదాo ను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పత్తి
📅 18 February 2026, 02:50 PM ✍️ admin
News Image
జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవిఎం ల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాo వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ ఫుటేజ్ ల గదుల పనితీరు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేనీ శ్రీనివాస్, బిజెపి పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, టిడిపి పార్టీ ప్రతినిధి ఎర్రవెళ్ళి రవీందర్ సిపిఎం పార్టీ ప్రతినిధి డి.నరేష్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
🏠 Home