నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారణ కార్యక్రమాన్ని ఏర్పాటు
ఫిబ్రవరి 16
జనగామ
సోమవారం జనగాం స్టేషన్ ఘన్పూర్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు జనగాం, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గ సభ్యులచే జనగాం, స్టేషన్గన్పూర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు గోపీరామ్,డిఎస్ వెంకన్న ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఉదయం 11 గంటలకు..మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులచే ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించగా... స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కి సంబందించి...చైర్మన్ గా..తాటికొండ వినయ్ కుమార్ ను గుర్రం హరినాథ్ ప్రతిపాదించగా బొల్లు లక్ష్మి బలపరిచారు. అలాగే వైస్ చైర్పర్సన్ గా రాజమ్మ నీల ను పొన్న రవి ప్రతిపాదించగా అంగడి రజిత బలపరిచారు. ఈ ఇద్దరిని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యులు ఎంచుకున్నారు. అనంతరం వారిని చైర్మన్ , వైస్ చైర్పర్సన్ గా స్టేషన్గన్పూర్ ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న ప్రమాణ స్వీకారం చేయించి, సంబంధిత ధ్రువపత్రాలను వారికి అందించారు. జనగాం మున్సిపాలిటీ కి సంబందించి...చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహణ కి అనుకూల పరిస్థితులు లేకపోవడం తో
ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరామ్... రేపటికి ఎన్నికని వాయిదా వేయడం జరిగిందని తెలిపారు