రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి-10:
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో జిల్లా విద్యార్థినులు అద్బుత ప్రదర్శన కనబరిచారని వీరికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా విద్యార్థినులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఫిబ్రవరి 8న వేములవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్థాయి కరాటే 2026 పోటీలలో పెద్దపల్లి జిల్లా విద్యార్థి,విద్యార్థినులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. కరాటే పోటీలలో జూలపల్లి మండలం పెద్దాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ సంకెండ్ల లక్ష్మణ్ ను అభినందించారు. కరాటే కట్టాస్ విభాగంలో గోల్డ్ మెడల్ విజేత సహస్ర, సిల్వర్ మెడల్ విజేతలు sd.అహ్మద్, హర్షవర్ధన్ సాహితి, శివ వర్దిని లు తదితరులు పాల్గొన్నారు .