సినిమా, నిర్మాణ రంగాలలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు .... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి -09:
సినిమా, నిర్మాణ రంగాలలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు .... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు సమర్పించాలి
3 నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ సినిమా , నిర్మాణ రంగాలలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నామని ఆసక్తి గల వారు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్, డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్ , కన్స్ట్రక్షన్ సేఫ్టీ, మెకానికల్, కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిషన్ ఎన్విరాన్మెంటల్, సర్వేయర్, సూపర్వైజర్, మెకానికల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం వివిధ కోర్సులలో నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
సినిమా కోర్సు కు 10వ తరగతి, నిర్మాణరంగ కోర్సులకు డిప్లమా, ఐటిఐ, బీటెక్ ఉత్తీర్ణత ఉండాలని, హైదరాబాద్ కొండాపూర్ లోని న్యాక్ అకాడమీలో శిక్షణ ఉంటుందని అన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కోర్సు పట్ల ఆసక్తి గలవారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 225 లో గల జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంబంధిత ధృవ పత్రాలతో తమ పేర్లు ఫిబ్రవరి 20 లోపు నమోదు చేసుకోవాలని , ఇతర వివరాలకు 9963313318, 9000294176 నెంబర్ల నందు సంప్రదించాలని ఆ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.