Banner
Watermark
కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
📅 09 February 2026, 02:39 PM ✍️ admin
News Image
ఫిబ్రవరి 9
జనగాం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి ల సమక్షంలో సోమవారం నిర్వహించారు. కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ ని నిర్వహించారుఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న జనగాం, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.జనగాం మున్సిపాలిటీ కి సంబందించి.. 30 వార్డ్స్ లో 66 పోలింగ్ స్టేషన్స్ కి 20% రిజర్వ్ తో 80 PO, 80 APO, 240 OPO, లు స్టేషన్ ఘనపూర్ కి సంబందించి...18 వార్డ్స్ కి 36 పోలింగ్ స్టేషన్స్ కి 20% రిజర్వ్ తో 44 PO, 44 APO, 132 OPO లను ర్యాండమైజేషన్ ద్వారా నియమించారు జనగాం మున్సిపాలిటీ కి సంబందించి 26 పోలింగ్ లొకేషన్ లకు 28 మంది, ఘనపూర్ కి సంబందించి 7 లొకేషన్ లకు 9 మంది మైక్రో అబ్సర్వర్ లను కూడా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు
ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, నోడల్ అధికారి హోసింగ్ పీడీ మాతృ నాయక్, EDM గౌతమ్ పాల్గొన్నారు
🏠 Home