కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహిన
ఫిబ్రవరి 7
జనగాం
జిల్లాలో రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు గాను పోలింగ్, ఓట్ల లెక్కింపు (Counting) ప్రక్రియలపై ఎన్నికల విధుల్లో పాల్గొనే po, apo లకు శనివారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.... అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, ట్రైనింగ్ నోడల్ అధికారిణి మాధురి షా పాల్గొని అధికారులకు విపులమైన మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియలో పాటించవలసిన నియమాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పోలింగ్ సమయంలో ఎదురయ్యే సాధారణ సమస్యలు, వాటి పరిష్కార విధానాలపై కూడా అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వార్డు వారీగా క్రమబద్ధంగా కౌంటింగ్ నిర్వహణ, ప్రారంభ,తుది కౌంటింగ్ విధానం, సందేహాస్పద బ్యాలెట్ పేపర్ల పరిశీలన, రీకౌంటింగ్‌కు సంబంధించిన నిబంధనలు, ఫలితాల ప్రకటన విధానం వంటి అంశాలను సవివరంగా వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ.....ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తి అవగాహనతో, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు