ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
📅 06 February 2026, 02:26 PM
✍️ admin
ఫిబ్రవరి 6
జనగాం
సీఎం కప్
చదువు తో పాటు క్రీడ ల్లో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సీఎం కప్ లో భాగం గా.. శుక్రవారం స్థానిక ధర్మ కంచ మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన జనగాం నియోజకవర్గ స్థాయి పోటీలకి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిది గా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ....విద్యార్థులు క్రీడలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి లో జరిగే పోటిల్లో జిల్లా నుండి వెళ్లే క్రీడాకారులు తమ ప్రతిభ ను చూపించి చాలా మెడల్స్ జిల్లా కి వచ్చేలా ఆడి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఇనుమడింపజేయాలన్నారు. విద్యార్థుల ఫిటినెస్ ప్రకారం...పాఠశాల లలో ఉన్న పి ఈ టి లు క్రీడలలో వారు రాణించేలా తగు శిక్షణ ని ఇవ్వాలన్నారు. సమయాన్ని వృధా చేయకుండా సెలవు లు వచ్చినప్పుడు... విద్యార్థులు వారికి ఇష్టం ఉన్న క్రీడలకు సంబందించిన కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటిల్లో ఓడిపోతే... నిరాశ చెందకుండా..... మరింత కసి తో ముందుకు పోవాలన్నారు. అనంతరం... పోటిల్లో పాల్గొంటున్న క్రీడా కారులను కలెక్టర్ పరిచయం చేసుకొని...క్రీడలను ఆడి వారిలో ఉత్తెజాన్ని కలిగించారు