మండేలగూడెం గ్రామము శివారులలో పులి సంచరన
📅 06 February 2026, 12:17 PM
✍️ admin
ఫిబ్రవరి 6
జనగాం
రఘునాథపల్లి మండలము, మండేలగూడెం గ్రామము శివారులలో పులి సంచరిస్త్తున్నట్లు దాని అడుగుల ద్వారా గుర్తించడము జరిగింది. పులి ఒక పశువును కూడా చంపినట్లు గుర్తించారు. కావున చుట్టూ ప్రక్కన మండలము లో గల ప్రజలు... లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల & తరిగొప్పుల మొదలగు మండలాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండవలెను. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయములో బయటికి రాకూడదు. ఒకవేళ అత్యవసరమైన పని ఉన్నచో గుంపు గుంపులుగా వెళ్లవలెను. రాత్రి సమయములో బయట తిరగకూడదు. రైతులు బావుల వద్ద ఉచ్చులను, కరెంటు వైర్లు అమర్చకూడదు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలి. ఏదయినా పులి సంచార సమాచారము తెలిసినచో ఫారెస్ట్ వారిని గాని పోలీస్ వారిని సంప్రదించి వారు నిర్దారించిన తర్వాతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలరు. అసత్య ప్రచారము సోషల్ మీడియాలో పోస్ట్ చేసినచో కఠిన చర్యలు తీసుకుంటాం