ఉపకార వేతనాల దరఖాస్తుల హర్డ్ కాపీలను వెంటనే సమర్పించాలి.... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి
📅 31 January 2026, 01:04 PM
✍️ admin
పెద్దపల్లి, జనవరి -31:
బీసి , ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను వెంటనే సమర్పించాలని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి అధికారి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ , ఈ.బి.సి విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనం (ఎం.టి.ఎఫ్) నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. కావున 2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ దరఖాస్తులు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నందు హర్డ్ కాపీలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.