ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు లక్ష్యాన్ని సాధించె అంశం మీద ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
📅 24 January 2026, 04:39 PM
✍️ admin
జనవరి 24
జనగాం
ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు లక్ష్యాన్ని సాధించె అంశం మీద ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఉదయం క్యాంపు కార్యాలయం నుండి జూమ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగాం జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,నోడల్ అధికారులు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్లు సజావుగా నమోదు కోసం సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల నమోదులో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని ఆదేశించారు.ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, DSDO విక్రమ్ పాల్గొన్నారు