Banner
Watermark
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల అమలు పరిశీలన
📅 24 January 2026, 04:19 PM ✍️ admin
News Image
తేదీ 24/01/2026
నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల అవగాహన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల అమలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ ప్రధమ చికిత్స బాక్సులు తప్పనిసరిగా ఉండాలని, వాటిలో కాటన్, రోలర్ బాండేజ్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, పావిడిన్ అయోడిన్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, పారాసిటమోల్ ట్యాబ్లెట్లు, అడ్హెసివ్ పేపర్ ప్లాస్టర్, సర్జికల్ గ్లౌజులు వంటి ప్రాథమిక వైద్య సామగ్రిని కంపల్సరీగా ఉంచాలని ఆర్టీసీ అధికారులకు ఈ విషయమై ఆర్టీసీ మేనేజర్ గారికి స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో పాటు, ప్రయాణ సమయంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రాథమిక చికిత్స అందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు రోడ్ సేఫ్టీ నిబంధనల అమలు అత్యంత ముఖ్యమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తో పాటు పి ఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా గారు, ఆర్టీసీ అధికారులు కూడా పాల్గొన్నారు.
🏠 Home