ప్రజల సమస్య లకు వెంటనే పరిష్కారం జరగాలని అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్
📅 19 January 2026, 02:27 PM
✍️ admin
ప్రజల సమస్య లకు వెంటనే పరిష్కారం జరగాలని అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్ అన్నారు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని...జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతులను అదనపు కలెక్టర్ లు స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులను ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ... గ్రీవెన్స్ దరఖాస్తు లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి... వినతులను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి సంబందింత దరఖాస్తు దారుడికి సమాచారం అందించాలన్నారు. ఈ నాటి ప్రజావాణి కార్యక్రమానికి 20 దరఖాస్తు లు వచ్చాయి. ఈ కార్యక్రమం లో ఆర్డివో గోపిరామ్, వివిధ శాఖలకి చెందిన అధికారులు పాల్గొన్నారు