మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
📅 15 January 2026, 07:43 PM
✍️ admin
వానరులకు ఆహారం అందించడానికి గంభీరావుపేట వెళ్లిన మహమ్మద్ రఫీక్
నేటి ప్రభాత దర్శిని:
సెలవు దినం కావడంతో ట్రస్టు సభ్యుడైన మహమ్మద్ రఫీక్ తన కూతురు సలీనా నాజ్, కుమారుడు సిన్నన్ ముబారిక్ తో కలిసి ద్విచక్ర వాహనంపై గంభీరావుపేట చౌరస్తాకు వెళ్లి వానరులకు పండ్లు, పుట్నాలు అంద జేయడం జరిగిందని పిల్లలకు కూడా సేవాదృక్పదం గురించి తెలియాలన్న ఉద్దేశ్యంతో పిల్లలను తీసుకుని వెళ్లడం జరిగిందని, అడవుల్లో వానరాలకు ఆహారం దొరక్కనే పట్టణంలో తిరుతున్నాయని అలా కాకుండా మన వంతు బాధ్యతగా ఊరి బయట ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కలు నాటినట్లైతే వానరమూకలు పట్టణాల్లోకి రావడం తగ్గే అవకాశం ఉందన్నారు