రూ.6 లక్షల లంచం డిమాండ్... రూ.3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మీర్ చౌక్ ఇన్‌స్పెక్టర్ కొండల్ రావు , హోంగార్డు
రూ.6 లక్షల లంచం డిమాండ్... రూ.3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మీర్ చౌక్ ఇన్‌స్పెక్టర్ కొండల్ రావు , హోంగార్డు
నేటి ప్రభాత దర్శిని ! హైదరాబాద్, చార్మినార్ ! అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కొండల్ రావు , హోంగార్డు అబిద్ ఆలీ చిక్కారు. ఒక కేసును మూసివేయడంతో పాటు, బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకారం అందించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఏసీబీ అధికారులు వివరాల ప్రకారం.. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. కొండల్‌రావు ఫిర్యాదుదారుడి నుంచి రూ.(6)లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ.(3) లక్షల మొత్తాన్ని హోంగార్డు అబిద్ అలీ ద్వారా మంగళవారం రాత్రి స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును మూసివేయడం, అతనిపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండటం, భవిష్యత్తులో సహకారం అందించడం వంటి పనుల కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. హోంగార్డు అబిద్ అలీ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.(3)లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులిద్దరినీ అరెస్టు చేసి, నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.