Banner
Watermark
తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ, పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో, 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగినది.
📅 26 October 2026, 04:11 PM ✍️ admin
News Image
అక్టోబర్ 26
జనగామ
తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ, పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో, 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగినది.

తెలంగాణ పారా మెడికల్ బోర్డ్ సెక్రటరీ నోటిఫికేషన్ కు అనుగుణంగా, ప్రభుత్వ వైద్య కళాశాల, జనగామ నందు:
1) డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కొర్స్ (02Years) DMIT (30),

2) డిప్లొమా ఇన్ ఆప్తాలమిక్ అసిస్టెంట్ కొర్స్ (02 Years) – DOA (30) కోర్స్ లకు గాను Intermediate నందు Bi.P.C./M.P.C. ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి, ఒకవేళ Bi.P.C./M.P.C. విద్యార్ధులు లేని యడల ఇతర Intermediate కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరడమైనది.

ఈ దరఖాస్తులను సమర్పించుటకు చివరి తేదీని 31.10.2026. వరకు పొడిగించనైనది.

ఈ దరఖాస్తులను ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనగామ కార్యాలయం నందు తేదీ 31.10.2026 సాయంత్రం 5.00 గంటల వరకు అందజేయగలరు.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ పారా మెడికల్ బోర్డు వెబ్ సైట్ లో తేదీ. 15-10-2026 నుంచి అందుబాటులో ఉంచడం జరిగింది.

Telangana Paramedical Board Website: www. tgpmb.telangana.gov.in

ప్రిన్సిపాల్,
నాగమణి,
ప్రభుత్వ వైద్య కళాశాల,
జనగామ జిల్లా.
🏠 Home